schedule Saturday, July 04, 2026

మనోరంజకంగా సుందరకాండ పారాయణం

calendar_today March 18, 2023
person dharshininews
మనోరంజకంగా సుందరకాండ పారాయణం
మనోరంజకంగా సుందరకాండ పారాయణం - తాండూరు గోశాలలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత - భారీగా తరలివచ్చిన భక్తులు, గోసేవకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని గోశాలలో సుందరకాండ పారాయణం మనోరంజకంగా కొనసాగింది. శనివారం గోశాలలో ఆదర్శనగర్ లోని అపెక్స్ డయాగ్నోస్టిక్స్, సాయి చికెన్ సెంటర్ యజమాని యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యుల సహాకారంతో సుందరకాండ పారాయణం ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో డా.శరత్ సార్డా, డా. సురేష్ సార్డాలు సుందరకాండ పారాయణం పఠించారు. లంకలో సీతాదేవి, హన్మంతుని మధ్య జరిగిన ఘట్టాలను పద్య రూపంలో పటించారు. ఆద్యంతం సుందరకాండ పారాయణం మనోరంజకంగా కొనసాగింది. గోశాలలో నిర్వహించిన సుందరకాండ పారాయణానికి గోభక్తులు, గోసేవకులు, పట్టణ ప్రముఖులు, యువకులు, మహిళలు భారీ ఎత్తున తరలిరావడంతో గోశాల కిక్కిరిసి పోయింది. పారాయణ పఠనంతో గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిసిరింది. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, గోశాల సభ్యులు మన్మోహన్ సార్డా, పటేల్ విజయ్ కుమార్, సాయిపూర్ బాల్ రెడ్డి, ఓం ప్రకాష్ సోమాని, శెట్టి రమేష్, వినోద్ జైన్, సిరిగిరిపేట్ రాము, సంజయ్ సార్డా, కిషోర్ పటేల్, లింగదలి రవికుమార్, బాలాజీ వెంకటేష్, విష్ణురాం చౌదరి, న్యాయవాదులు గుండప్ప, నరేందర్ గౌడ్, పలువురు ప్రముఖులు. యువకులు తదితరులు పాల్గొన్నారు. గోశాలకు చేయూత: సుందరకాండా పారాయణ మహోత్సవంలో ఆదర్శనగర్‌ అపెక్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ యజమానులు గోశాలకు ఆర్థిక చేయూతను అందించారు. గోశాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు.