ఇంటింటా కొలువుదీరిన గణనాథుడు
September 10, 2021
dharshininews
ఇంటింటా కొలువుదీరిన గణనాథుడు
- తొలిపూజలు చేసిన భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి సందర్భంగా తెలుగు ఇండ్లలో గణనాథుడు కొలువుదీరాడు. శుక్రవారం వినాయక చవితిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో భక్తులు తమ ఇండ్లలో గణేషున్ని ప్రతిష్టించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం ఇంట్లో ప్రతిష్టించిన గణపయ్యలకు ముందు పూజలు నిర్వహించారు. వినాయకునికి పీత్రిపాత్రమై ఉండ్రాల్లను నైవేద్యంగా సమర్పించారు. పండ్లు, ప్రసాదాలతో పూజలు నిర్వహించి సల్లంగా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. దీంతో పట్టణంలోని తెలుగు ఇండ్లలో వినాయక చవితి సందడి నెలకొంది.