schedule Saturday, July 04, 2026

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

calendar_today March 25, 2023
person dharshininews
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి - రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ - మర్యాదపూర్వంగా కలిసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నాయకులు బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆరోగ్య భద్రత కోసం 10 లక్షల రూపాయలు, ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 20 లక్షల రూపాయలను చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసి సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా పే స్కేలు అమలు చేయాలని వినతి చేశారు. అనంతరం శుభప్రద్‌ పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా శాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షా యందు 21 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన గత 15 సంవత్సరాల నుంచి తమ విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని శుభప్రద్ పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం సభ్యులు రవినాయక్, అనితా, కృష్ణయ్య, రాగిణి, జ్యోతి, మీనాక్షీ, అంజయ్య, మమత, రమాదేవి, దశరథ్, కమాల్, వెంకటయ్య , నర్సింహులు, చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, మోహన్, రాజు, గౌస్, వెంకట్ మరియు సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.