schedule Saturday, July 04, 2026

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

calendar_today March 25, 2023
person dharshininews
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్, కార్యదర్శిగా పాశం రవికుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిఫ్‌ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా పాశం రవికుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా రజిత, కోశాధికారిగా విశ్వనాథ్, మహిళ ప్రతినిధిగా అరుణలు ఎన్నికయ్యారు. ఈ ఆసోసియేషన్ ఎన్నికల అధికారిగా బి. భవనప్ప వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మఠం చంద్రశేఖర్, పాశం రవికుమార్లు మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి అందరి సహాకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. తాండూరుకు సబ్‌ కోర్టు సాధించేవిధంగా నిరంతర ప్రయత్నం చేస్తామన్నారు.