schedule Saturday, July 04, 2026

కంటి వెలుగుతోనే అంధత్వం దూరం

calendar_today March 29, 2023
person dharshininews
కంటి వెలుగుతోనే అంధత్వం దూరం
కంటి వెలుగుతోనే అంధత్వం దూరం - అందరు సద్వినియోగం చేసుకోవాలి - మల్కాపూర్ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగుతోనే పేదల అంధత్వ సమస్యలు దూరం అవుతాయని తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి అన్నారు. బుధవారం మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు - 2 శిబిరాన్ని సర్పంచ్ విజయలక్ష్మీ పండరి ఎంపీటీసీ రవి శిందే, గని కార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, ఉపసర్పంచ్ మాజిద్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచుతో పాటు పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆంధత్వ సమస్యలను దూరం చేసేందుకు కంటి వెలుగును ప్రారంభించిందని అన్నారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన కంటి వెలుగు పథకంతో కంటి సమస్యలు ఉన్న పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షలు చేయించుకున్న బాధితులకు ఉచితంగా కంటి అద్దాలు, మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడ చేయించడం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కాశినాథ్, వార్డు సభ్యులు సిద్దమ్మ, మైనోద్దీన్, మోహన్ గౌడ్, పండరి చారి, బుడ్డన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.