schedule Saturday, July 04, 2026

నాలుగు రోజులు భగ..భగలే..!

calendar_today March 31, 2023
person dharshininews
నాలుగు రోజులు భగ..భగలే..!
నాలుగు రోజులు భగ..భగలే..! - రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు - జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: మార్చి మాసంలో సూరీడూ మండే అగ్నిగోళం అయ్యాడు. ఇంకా నాలుగులు సూర్యప్రతాపం చూపేందుకు సిద్దంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజులపాటు భానుడు భగ.. భగ మండుతాడని వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని, మరికొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెల్పింది. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలోని రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ-గద్వాల, వికారాబాద్‌, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్‌, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీతు దాటితే వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు (ఎల్లో, ఆరెంజ్‌, రెడ్‌) జారీ చేస్తుందనే విషయం తెలిసిందే. తాజా ప్రకటన మేరకు గరిష్ఠ ఆదిలాబాద్‌, కుమురంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలో ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది.