schedule Saturday, July 04, 2026

పది పరీక్షలకు బందోబస్తు

calendar_today April 1, 2023
person dharshininews
పది పరీక్షలకు బందోబస్తు
పది పరీక్షలకు బందోబస్తు - అవాంచనీయ సంఘటనలు జరిగే ఫిర్యాదు చేయండి - కరణ్‌కోట్ ఎస్ ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కరణ్‌కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఈనెల 3వ తేది నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఈ మేరకు తాండూరు మండలం కరణ్ కోట్, మల్కాపూర్ గ్రామాల్లో కేటాయించిన పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్ విధించడం జరుగుతుందని చెప్పారు. కావున కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. దీంతో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని అన్నారు. కేంద్రాల లోపలికి విద్యార్థులకు, ఇన్విజిలేటర్లు, పరీక్ష పర్యవేక్షణ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని, గేటు మూసిన తరువాత లోపలికి వెళ్లే అనుమతి ఇతరులకు ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏదైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే డయల్ 100 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసేంత వరకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.