schedule Saturday, July 04, 2026

క్వశ్చన్ పేపర్ ప్రత్యక్ష్యంపై వేటు

calendar_today April 3, 2023
person dharshininews
క్వశ్చన్ పేపర్ ప్రత్యక్ష్యంపై వేటు
క్వశ్చన్ పేపర్ ప్రత్యక్ష్యంపై వేటు - నలుగురు సస్పండ్, మరొకరిపై చర్యలు - క్రిమినల్ కేసులకు జిల్లా కలెక్టర్ ఆదేశం - రేపటి పరీక్షపై క్లారిటీ ఇచ్చిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షం వ్యవహారంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహరంలో ప్రధాన సూత్రదారి బందెప్పతో పాటు ఇతరులకు ఉన్న సంబంధంపై విచారణ జరిపించారు.   ఇందులో బందెప్ప మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రధానంగా ఉన్న బందెప్పతో పాటు సమ్మప్పను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.   అంతేకాకుండా డీఓ శివకుమార్, సీఎస్ గోపాల్ ను కూడ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రానికి ఇన్విజిలేటర్ గా ఉన్న శ్రీనివాస్ ను తప్పించి... ఆయనపై కూడ సమగ్ర విచారణకు ఆదేశించారు.     రేపటి పరీక్షపై నిర్వహణపై క్లారిటీ మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం సంచలం రేపడంతో రేపు జరగబోయే పరీక్ష వాయిదా పడుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు.   రేపు జరగబోయే పదవ తరగతి పరీక్షలు యథాతధంగా జరుగుతాయని దేవసేన స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు