లీకేజీలతో జీవితాల చెలగాటమా..?
April 4, 2023
dharshininews
లీకేజీలతో జీవితాల చెలగాటమా..?
- తెలంగాణ సర్కారు నిర్లక్ష్యంతోనే పేపర్ల లీకేజీలు
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు, యువత జీవితాతో తెలంగాణ సర్కారు చెలగాటం ఆడుతోందని, వరుసగా పేపర్ల లీకేజీలతో వారి జీవితాలు ఆగమయ్యే ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రబాకర్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పరీక్షల నిర్వహణ నిర్లక్ష్యంగా మారిందన్నారు. మొన్న టీఎస్పీఎస్సీ పరీక్షల పత్రాల లీకేజీలతో యువతకు అన్యాయం జరిగిందన్నారు. నిన్న ప్రారంభమైన పదో తరగతి పరీక్ష పత్రం ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం, మంగళవారం రెండో రోజు హిందీ పేపర్ కూడ లీకేజీ కావడం దారుణమన్నారు.
తెలంగాణలో సర్కారు నిర్లక్ష్యం వల్ల లీకేజీలు జరుగుతున్నాయన్నారు. పేపర్ల లీకేజీ వల్ల విద్యార్థులు, యువత జీవీతాలు ఆగమ్యగోచరంగా మారాయన్నారు. కార్పోరేట్, ప్రైవేటు సంస్థలకు తొత్తులుగా మారినట్లు కనిపిస్తోందని అన్నారు. పేపర్ల లీకేజీల వ్యవహారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పూర్తి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పేపర్ లీకేజీలకు కారకులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.