schedule Saturday, July 04, 2026

టెన్త్‌ విద్యార్థి సూసైడ్..!

calendar_today April 5, 2023
person dharshininews
టెన్త్‌ విద్యార్థి సూసైడ్..!
టెన్త్‌ విద్యార్థి సూసైడ్..! - పరీక్షా బాగా రాయలేదని మనస్థాపం - చెరువులో దూకి ఆత్మహత్య - యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: పరీక్షా భాగా రాయలేదని మనస్థాపంతో టెన్త్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం పెద్దెముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన కిష్టప్ప మల్లమ్మ దంపతుల మూడో కుమారుడు రమేష్ యాలాల మండలం మల్రెడ్డిపల్లి లో ఉంటున్న పెద్దమ్మ వద్ద ఉండి అదే మండలం అగ్గనూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలో భాగంగా రమేష్‌ గౌతమి పాఠశాలలో కేంటాయించిన కేంద్రానికి పరీక్ష రాసేందుకు హాజరయ్యారు. అదే రోజు 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటికి రావడంతో సదరు పాఠశాలలో మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో రమేష్‌ పరీక్ష బాగా రాయలేదని మనస్థాపం చెందాడు. ఇంటికి చేరిన రమేష్ ఈ విషయాన్ని తోటి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పేర్కొన్నట్లు తెలిసింది. తెలుగు పరీక్ష తర్వాత పరీక్ష బాగా రాయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి రమేష్ ఇంట్లో హాల్ టికెట్ వదిలి వెళ్లిపోయాడు. రెండు రోజులు ఆచూకీ తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేడు బుధవారం గ్రామం పక్కనే ఉన్న రెడ్డి చెరువులో రమేష్‌ శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేయాన్ని తాండూరులోని జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. రమేష్ ఆత్మహత్యతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.