schedule Saturday, July 04, 2026

కంటి వెలుగు దేశానికి ఆదర్శం

calendar_today April 11, 2023
person dharshininews
కంటి వెలుగు దేశానికి ఆదర్శం
కంటి వెలుగు దేశానికి ఆదర్శం - అంధత్వ నియంత్రణే సర్కారు లక్ష్యం - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు - సాయిపూర్‌లో కంటి వెలుగు శిబిరం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 9వ వార్డులో కంటి వెలుగు రెండో విడత శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్లోళ్ల దీపా నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం వైద్యుల సమక్షంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన కంటి వెలుగు దేశానికి వెలుగునిస్తోందన్నారు. అంధత్వ నియంత్రణే లక్ష్యంగా సర్కారు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిందన్నారు. కంటి సమస్యలతో బాధపడే పేదలు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించుకున్న పేదలకు ఉచితంగా మందులు, కంటి అద్దాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.హరీష్, సిబ్బంది సారి, సుధారాణి, స్వప్న, ఆశ వర్కర్ అనిత, అంగన్ వాడి టీచర్ నవీనా, ఆర్పీలు సైరా భాను, హారి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.