schedule Saturday, July 04, 2026

30 ఏండ్లు దాటినా పెళ్లి కావడం లేదని..!

calendar_today April 15, 2023
person dharshininews
30 ఏండ్లు దాటినా పెళ్లి కావడం లేదని..!
30 ఏండ్లు దాటినా పెళ్లి కావడం లేదని..! - మనస్థాపం చెంది వ్యక్తి మృతి - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : 30 ఏళ్లయినా పెళ్లి కావడం లేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ మున్సిపల్ పరిధి గ్రీన్ సిటీ కాలనీకి చెందిన మెహన్ రెడ్డి కుమారుడు మనోహర్ రెడ్డి(36) ఇంటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. గత కొన్ని నెలల నుంచి తనకు 30 ఏళ్ళు దాటిన పెళ్లి కావడం లేదని మనస్థాపం చెందేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం గమనించిన తండ్రి మోహన్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అతని తండ్రి పేరు యదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.