schedule Saturday, July 04, 2026

ఈత చెట్టుపై పిడుగు..!

calendar_today April 16, 2023
person dharshininews
ఈత చెట్టుపై పిడుగు..!
ఈత చెట్టుపై పిడుగు..! - వికారాబాద్‌ జిల్లాలో ఘటన - వీడియో చిత్రీకరించిన స్థానికులు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో పిడుగు పడింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సాయి నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం తరువాత ఈదురుగాలితో కూడిన భారీ వర్షం ప్రారంభమయ్యింది. వర్షం పడే క్రమంలో భారీ శబ్దం వినిపించింది. కాలనీలోని ఓ ఈతచెట్టు పై పిడుగు పడినట్లు స్థానికులు గుర్తించారు. పిడుగు పాటుతో ఈత చెట్టుపై మంటలు చెలరేగాయి. చెట్టుపై పడిన పిడుగు పాటును స్థానికులు సెల్‌ ఫోన్లలో వీడియో తీశారు. పిడుగు పడిన తరువాత ఈత చెట్టు పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పిడుగు పాటుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్టుపై పడింది సరిపోయింది కాని ఇండ్లపై, ప్రజలపై పడి ఉండే భారీ నష్టం జరిగి ఉండేందని ఆందోళన చెందారు. ఇదిలా ఉండగా జిల్లాలో భారీ వర్షాలు, వడగండ్లు కురిసే అవకాశం ఉందని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వికారాబాద్‌ జిల్లాకు ఎల్లో అలెర్ట్ ను కూడ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. [video width="640" height="352" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Video-2023-04-16-at-16.54.49.mp4"][/video]