కాంగ్రెస్‌తోనే నిరుద్యోగులకు న్యాయం
May 7, 2023
dharshininews
కాంగ్రెస్‌తోనే నిరుద్యోగులకు న్యాయం
- యూత్ డిక్లరేషన్ సభను జయప్రదం చేయాలి
- యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రేపు(సోమవారం) సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ముఖ్యఅతిథిగా హజరువుతున్నారని, ఆమె పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేకపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగభృతి ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. యువ సంఘర్షణ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.--------------------కింది వరకు చూడండి
ఇవి కూడా చదవండి...
బాలాజీ చిట్స్ ఆస్తుల జప్తుకు రంగం సిద్దం
- త్వరలోనే బాధితులకు న్యాయం
- వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
https://dharshininews.com/16942