schedule Saturday, July 04, 2026

దోస్త్‌ నోటిఫికేషన్ విడుదల

calendar_today May 11, 2023
person dharshininews
దోస్త్‌ నోటిఫికేషన్ విడుదల
దోస్త్‌ నోటిఫికేషన్ విడుదల - డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు అవకాశం - ప్రకటించిన ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్‌ గురువారం విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడిచింది. మొదటి విడతలో భాంగా మే 16 నుంచి జూన్ 10 వరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది. రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి 26 వరకు ఉంటాయన్నారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి విడతకు సంబంధించి మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్‌ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రెండో విడత వెబ్‌ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. ఇక మూడో విడతలో జులై 1 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇది కూడా చదవండి... అయ్యో.. దత్తాత్రేయశ్వరా..! - స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు - శక్తిపీఠాల పూజల కోసం అని పుకార్లు - తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన https://dharshininews.com/17118