schedule Saturday, September 05, 2026

స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..!

calendar_today May 15, 2023
person dharshininews
స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..!
స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..! - సర్కారు బడులలో అమలు - వచ్చే ఏడాది నుంచి కొత్త మెను హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: చదువుతో పాటు పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వ బడులలో ప్రాధాన్యం అందిస్తున్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు. దీంతోపాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాలను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగిజావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదివరకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని యోచనలో ఉంది. మరోవైపు బెల్లం పౌడర్, రాగి పిండిని బడులకు అందజేయనుండగా, మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగి జావాను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీని అమలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144