schedule Saturday, July 04, 2026

'మాతా శిశువు' ఇక క్షేమం..!

calendar_today May 20, 2023
person dharshininews
'మాతా శిశువు' ఇక క్షేమం..!
'మాతా శిశువు' ఇక క్షేమం..! - జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్‌లకు వైద్య పరికరాలు - రూ.42.50 లక్షలతో అత్యాధునిక పరికరాల కొనుగోలు - ఎమ్మెల్యే విజ్ఞప్తితో వైద్య శాఖ నుంచి నిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, దానికి అనుబంధంగా ఉన్న మాతాశిశు ఆసుపత్రుల దశ తిరుగుతోంది. ఈ రెండు ఆసుపత్రులలో పేదల క్షేమానికి భరోసా లభించబోతోంది. పెద్దాసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులలో సరికొత్త వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆశాఖ అధికారులు స్పందించారు. ఈ రెండు ఆసుపత్రులలో అధునాత వైద్య పరికరాల ఏర్పాటుకు నిధులను విడుదల చేస్తూ జీవో 233ను జారీ చేశారు. వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం రూ.42.50 లక్షలను విడుదల చేశారు. ఈ నిధులతో రెండు ఆసుపత్రులలో కొత్తగా 80 పడకలతో పాటు బెడ్ లను కొనుగోలు చేస్తారు. మాతాశిశు ఆసుపత్రిలో కొత్తగా ఎక్స్ రే మిషన్, ఈసీజీ మిషన్, ఏబీజీ మిషన్, డీఫిబ్రిల్లేటర్, డిజిటల్ సెంట్రీఫ్యూగ్, క్యాలోరిమీటర్, ఇన్ క్యూబేటర్, కంప్యూటర్లు, ప్రింటర్లను మంజూరు చేశారు. జిల్లా ఆసుపత్రిలో కూడా ఇలాంటి పరికరాల ఏర్పాటుకు అనుమతి జారీ చేశారు. తాజాగా మంజూరు చేసిన నిధులతో పరికరాలను కొనుగోలు చేయాలని జీవోలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ ను ఆదేశించారు. టెండర్ల ద్వారా వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టిఎస్ఎంఎస్ఐడిసి) పరికరాలను సేకరిస్తుంది. వైద్య పరికరాల కొనుగోలుకు నిధులను విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి.. వేపాకుతో రోగాల దిగులు దూరం - ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు - తెలుసుకుని పాటిస్తే మేలు https://dharshininews.com/17186 chaithany collage