schedule Saturday, July 04, 2026

స్వచ్ఛ తాండూరును అందరి ధ్యేయం

calendar_today May 20, 2023
person dharshininews
స్వచ్ఛ తాండూరును అందరి ధ్యేయం
స్వచ్ఛ తాండూరును అందరి ధ్యేయం - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు - తడి, పొడిచెత్తను వేర్వేరుగా అందించాలి: కమిషనర్ శంకర్ సింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛ తాండూరుగా మార్చడమే అందరి ధ్యేయంగా పనిచేయనాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2023 మేరీ లైఫ్ - మేరీ స్వచ్చ షేహర్ కార్యక్రమంపై శనివారం తాండూరు పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఇంట్లో ఉండే పాత సామాన్లు, బట్టలు, పుస్తకాలు, సీసాలు తదితర వస్తువులు ఎలా రీయూజ్ చేయాలి, రెడ్యూజ్ ఎలా చేయాలి, రీసైకిల్ కేంద్రాలకు ఎలా తరలించాలనే దానిపై అవగాహన కల్పించారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కమీషనర్ శంకర్ సింగ్ లు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి చెత్తను. పొడి చెత్తను వేరు వేరుగా అందించాలని సూచించారు. తాండూరు పట్టణాన్ని స్వచ్ఛ తాండూరుగా మార్చుకోవడమే ధ్యేయంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ రంగనాథం, శానిటరీ ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్. ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, మెప్మా అధికారిణి సరిత, ఆర్పీలు హారిక, సైరా భాను. వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..! - వ్యర్థాలు కూడా బయటకు - ఆరేళ్ల పాపకు వింత వ్యాధి - కలకలం రేపుతున్న ఘటన https://dharshininews.com/17255 chaithany collage