schedule Saturday, July 04, 2026

ఎలాంటి పత్రాలు లేకుండా మార్పిడి..!

calendar_today May 21, 2023
person dharshininews
ఎలాంటి పత్రాలు లేకుండా మార్పిడి..!
ఎలాంటి పత్రాలు లేకుండా మార్పిడి..! - 2వేల నోటు ఎక్సేంజ్‌పై ఎస్బీఐ క్లారీటీ - డిపాజిటర్లకు ఏమని చెప్పిందంటే..? దర్శిని డెస్క్‌ : దేశంలో రూ. 2 వేల నోటు చెలామణి రద్దు చేసిన రోజు నుంచి అనేక పుకార్లు పుట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నోట్లను. మార్చుకునే విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. ఈ నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకుల్లో ఫారాలు నింపాలని, గుర్తింపు పత్రాలు సమర్పించాలని ఎన్నో అయోమయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) కీలక సూచనలు ఇచ్చింది. నోట్ల మార్పిడికి ఎలాంటి ఫాంలు నింపాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు పత్రాలు సైతం చూపించాల్సిన పనిలేదని చెప్పింది. రూ.20వేల వరకు బ్యాం కులో నేరుగా ఎక్స్చేంజ్ చేసుకోవ చ్చని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం స్టేట్ బ్యాంక్ మార్గదర్శకాలు విడుదల చేసింది. నోట్ల మార్పిడిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్న నేప థ్యంలో ఎస్బీఐ క్లారిటీ ఇచ్చింది. దీంతో డిపాజిటర్లకు ఊరట లభించింది. ఇది కూడా చదవండి... కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..! - వ్యర్థాలు కూడా బయటకు - ఆరేళ్ల పాపకు వింత వ్యాధి - కలకలం రేపుతున్న ఘటన https://dharshininews.com/17255 chaithany collage