schedule Saturday, September 05, 2026

జేపీఎస్‌లకు గుడ్‌ న్యూస్..!

calendar_today May 22, 2023
person dharshininews
జేపీఎస్‌లకు గుడ్‌ న్యూస్..!
జేపీఎస్‌లకు గుడ్‌ న్యూస్..! - జూ. పంచాయతి సెక్రటరీల రెగ్యూలరైజ్‌ సర్కారు నిర్ణయం - విధి విధానాల ఖరారుకు సీఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్‌)కు సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను (JPS) క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి క్రమబద్ధీకరణ విధివిధానాలను ఖరారు చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులరైజ్ చేయాలని 16 రోజులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం హామి ఇవ్వడంతో వారు సమ్మె విరమించి విధుల్లో చేరారు. తాజాగా ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ జేపీఎస్‌లను రెగ్యూలరైజ్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా ఫారెస్ట్‌ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగులను పనితీరును మదింపు చేయడం ఈ కమిటీ బాధ్యత. రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. మరోవైపు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి... స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..! - సర్కారు బడులలో అమలు - వచ్చే ఏడాది నుంచి కొత్త మెను https://dharshininews.com/17189 chaithany collage