schedule Saturday, July 04, 2026

వేటకొడవలితో 18 పోట్లు...!

calendar_today May 25, 2023
person dharshininews
వేటకొడవలితో 18 పోట్లు...!
వేటకొడవలితో 18 పోట్లు...! - అన్నను చంపిన తమ్ముడి రిమాండ్ - వివరాలను వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: భార్య, పిల్లలను వేధిస్తున్నాడని వేటకొడవలితో సొంత అన్నను ధారుణంగా హత్య చేశాడు ఓ తమ్ముడు. తాండూరు పట్టణంలోని చెంగోల్‌ బస్తిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడును పట్టణ పోలీసులు రిమాండుకు తరలించారు. గురువారం ఓ ప్రకటనలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. చెంగోల్ బస్తీకి చెందిన సతీష్ అలియాస్ సత్యం(36) ఈనెల 23న తన నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీష్ ను అతని తమ్ముడు రవిందర్ అలియాస్ రవి హత్య చేసినట్లు నిర్దారించారు. అయితే సతీష్ ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసై రవితో పాటు అతని భార్య, పిల్లలను వేధించేవాడు. తరుచూ గొడవలు కూడా పడుతుండడంతో విసుగు చెందాడు. ఈ క్రమంలో 23 వ తేదిన మద్యం సేవించి మత్తులో ఉన్న అన్న సతీష్‌ను గమనించి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఇంట్లో ఉన్న వేటకొడవలితో కోపంతో అన్న సతీష్ తల, ముఖం, మెడపై విక్షణరహితంగా దాడి చేశాడు. శరీరంపై మొత్తం 18 పోట్లు పొడిచి చంపేశాడు. సాయంత్రం గమనించిన స్థానికులు, బందువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుని తమ్ముడు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో గురువారం నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇది కూడ చదవండి... వ్యక్తి దారుణ హత్య - శరీరంపై బలమైన కత్తి గాట్లు - తాండూరు పట్టణంలో కలకలం - దర్యాప్తు చేపడుతున్న పోలీసులు https://dharshininews.com/17316 chaithany collage