schedule Saturday, July 04, 2026

చిరుధాన్యాలు ఎంతో మేలు

calendar_today May 27, 2023
person dharshininews
చిరుధాన్యాలు ఎంతో మేలు
చిరుధాన్యాలు ఎంతో మేలు - రైతులు ఆ పంటలను పండించాలి - తాండూరు వ్యవసాయ శాస్త్ర వేత్త డా. సుజాత - వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు సదస్సు తాండూరు, దర్శిని ప్రతినిధి : మానవ జీవన మనుగడకు చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా. సుజాత అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం తాండూరు పరిశోధన స్థానంలో చిరుధాన్యాలపై రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్ర వేత్త డా. సుజాత మాట్లాడుతూ ప్రస్తుత దైనందిత జీవితంలో ఆహారపు అలవాట్ల నుంచి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. రైతులు చిరుధాన్యాల పంటలను పండించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అదేవిధంగా పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు రాజేశ్వర్ రెడ్డి, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ యమున చిరుధాన్యాల పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మరోవైపు ఎస్. బి. ఫుడ్స్ తాండూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ ఏఓలు రజిత, యాదగిరి, నజీరుద్దీన్, విశ్వవిద్యాలయ విస్తరణ అధికారులు రమేష్, హరిచందర్, వివిధ మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడ చదవండి... పట్నం ఇంటికి పైలెట్..! - ఇరువర్గాలలో జోరుగా చర్చలు - రాజకీయ పరిణాలపై మాటామంతి https://dharshininews.com/17369 chaithany collage