schedule Saturday, July 04, 2026

పరిశుభ్రతే అందరి ధ్యేయం

calendar_today May 29, 2023
person dharshininews
పరిశుభ్రతే అందరి ధ్యేయం
పరిశుభ్రతే అందరి ధ్యేయం - పట్టణంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ - ఇందిరానగర్‌లో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ పరిశుభ్రతే అందరి ధ్యేయమని తాండూరు నాయకులు, అధికారులు పేర్కొన్నారు. మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ ష హేర్ ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు పట్టణంలో జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం తాండూరు పట్టణం 4వ వార్డులోని గుండుపిర్ల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, నాయకులు అక్రమ్, మున్సిపల్ టీఎంసీ సరిత, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ తదితరులు హాజరై పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ప్రజలు ఇంట్లో ఉన్న చెత్తను రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) ,చేసే విధానంను వివరించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలతో పాటు వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పట్టణ పరిశుభ్రతే అందరి ధ్యేయంగా చేయూతను అందించాలని సూచించారు. తాండూరును ఆదర్శంగా నిలుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మున్సిపల్ జవాన్లు, వార్డు మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... రేషన్‌కు హెల్ప్‌ లైన్..! - మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు - తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం https://dharshininews.com/17434 chaithany collage