schedule Saturday, September 05, 2026

ఎస్ఐ, కానిస్టేబుల్‌ రిజల్ట్ రిలీజ్..!

calendar_today May 30, 2023
person dharshininews
ఎస్ఐ, కానిస్టేబుల్‌ రిజల్ట్ రిలీజ్..!
ఎస్ఐ, కానిస్టేబుల్‌ రిజల్ట్ రిలీజ్..! - రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన బోర్డు - ఎంత మంది అర్హత సాధించారంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెంలగాణ రాష్ట్రంలో నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్సై తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు TSLPRB బోర్డు ఫలితాలను విడుదల చేసింది. సివిల్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు. ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది అర్హత సాధించారు. అలాగే ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేర్కొంది. ఈరోజు రాత్రి నుంచి అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెబ్‌సైట్ లో పెడతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌ సైట్‌ లో తమ వ్యక్తిగత లాగిన్ లో చూసుకోవచ్చని పేర్కొంది. ఇది కూడా చదవండి... కాళ్లకు కరెంటు చెప్పులు..! - అమ్మాయిల కోసం రూపకల్పన - ఆకతాయి వేషాలేస్తే అంతే సంగతులు - చెప్పుల ధర కూడా అందుబాటులోనే https://dharshininews.com/17455 chaithany collage