schedule Saturday, July 04, 2026

6 గంటల్లో పది ప్రసవాలు..!

calendar_today June 4, 2023
person dharshininews
6 గంటల్లో పది ప్రసవాలు..!
6 గంటల్లో పది ప్రసవాలు..! - అన్ని నార్మల్ డెలివరీలే - ఎంసీహెచ్‌ ఆసుపత్రి వైద్యుల కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు ఆసుపత్రులు పుట్టింటి మాదిరి పురుడు పోస్తున్నాయని వికారాబాద్‌ జిల్లా తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి మరోసారి రుజువు చేసింది. ఈ ఆసుపత్రిలో సీజరీయన్ కంటే సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తోంది. ఈ విషయంలో మాతా శిశు ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ప్రవేటు ఆసుపత్రుల కంటే ప్రసవం కోసం మాతా శిశు ఆసుపత్రికే జనం క్యూ కడుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఆసుపత్రి వైద్యులు తమ శక్తిమేర వైద్య సేవలను అందిస్తున్నారు. తాజాగా శనివారం ఆసుపత్రిలో పది సాధారణ ప్రసవాలు చేశారు. 6 గంటలలో పది ప్రసవాలను చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల మద్య ఈ ప్రసవాలు జరిగాయి. విధుల్లో డాక్టర్ కరిష్మా ప్రసూతి సేవలను అందించారు. మొత్తం 10 సాదారణ ప్రసవాలలో ఐదుగురు ఆడ పిల్లలు, ఐదుగురు మగ పిల్లలు జన్మించినట్లు తెలిసింది. మరోవైపు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఆసుపత్రి వైద్య అధికారులకు కూడా వైద్యుల సేవలను ప్రసంశిస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17569 chaithany collage