schedule Saturday, July 04, 2026

రక్తదానంతో మానవత్వం

calendar_today June 5, 2023
person dharshininews
రక్తదానంతో మానవత్వం
రక్తదానంతో మానవత్వం - అందరు రక్తదానం చేయాలి - మల్కాపూర్ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి - రక్తదాన శిబిరానికి స్పందన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం చేయడం గొప్ప మానవత్వం అని తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ ఆధ్వర్యంలో మల్కాపూర్ యువసేన తరుపున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి, బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్(ఆర్పీ గౌడ్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు పలువురు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మనషుల్లోని మానవత్వాన్ని చాటేందుకు అందరు రక్తదానం కోసం ముందుకు రావాలన్నారు. యువతే కాకుండా ప్రజలు కూడా రక్తదానం చేయాలన్నారు. షేక్ హసన్ పటేల్ మాట్లాడుతూ తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గాయని తెలిసి.. ఆపదలో ఉన్నవారికి ఇబ్బందు రావద్దనే ఉద్దేశంతో శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తరలివచ్చి రక్తదానం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ మాజిద్, మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, గని కార్మిక సంఘం డైరెక్టర్ గంజి రాములు, సతీష్ పాటిల్, పండరి చారి, మైనోద్దీన్, రాష్ట్రపతి, బాబు ఆహ్మద్, శేఖర్ గౌడ్, హర్షద్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17604 chaithany collage