schedule Saturday, July 04, 2026

విలేజ్ బస్‌ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు..!

calendar_today June 9, 2023
person dharshininews
విలేజ్ బస్‌ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు..!
విలేజ్ బస్‌ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు..! - ఆర్టీసీలో గ్రామానికో అధికారి నియామకం - తాండూరు డిపోలో 22 మంది ఎంపిక - నేటి నుంచే కొత్త వ్యవస్థకు శ్రీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్టీసీలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విలేజ్ బస్ ఆఫీసర్(వీబీఓ) పేరుతో ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తాండూరు డిపోలో 22 మంది సిబ్బందిని వీబీఓలుగా నియమించారు. మొదటి విడతలో వీరికి 66 గ్రామాలను అప్పగించారు. ప్రతిరోజు నిర్వర్తించే విధులతో పాటు విబివోలుగా కూడా సదరు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. వీబీఓలుగా నియమితులైన వారు ఆయా గ్రామాలలో ఆర్టీసీ గురించి ప్రచారం చేయాల్సి ఉంటుంది. సురక్షిత ప్రయాణంకు ఆర్టీసీ సాధించిన అవార్డులు, ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య, ఆర్టీసీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరక సాగించిన ప్రస్థానం, వివిధ రంగాలలో ఆర్టీసీ సాధించిన ప్రగతి లాంటి అంశాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రయాణికుల కొరకు ఆర్టీసీ అమలు చేస్తున్న పథకాలను కూడా వివరించాలి. వివిధ వర్గాల ప్రయాణికులకు ఆర్టీసీ పలు పథకాలను అమలు చేస్తోంది. వీటిని ఆయా వర్గాల వారికి వివరించి ఆర్టీసీకి మరింత ఆదరణ తీసుకరావాల్సి ఉంటుంది. శుక్రవారం వీబీఓల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తాండూరు డీపో మేనేజర్ సమత తెలిపారు. గ్రామాలకు వచ్చే విబివోలను ప్రజలు ఆదరించాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17695 chaithany collage