schedule Saturday, July 04, 2026

శభాష్ వినీషా..!

calendar_today June 13, 2023
person dharshininews
శభాష్ వినీషా..!
శభాష్ వినీషా..! - స్టేట్ ర్యాంకర్‌కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభినందన - సంక్షేమ సంబరాలలో అమ్మాయికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ వినీషా అంటూ తెలంగాణ ఎడ్ సెట్ రాష్ట్ర తొలిర్యాంకు విద్యార్థినిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభినందించారు. తాండూరు పట్టణం గ్రీన్ సిటీ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మొగులప్ప కుమార్తే, తాండూరు సింధూ డిగ్రీ కళాశాల విద్యార్థిని గొల్ల వినీషా ఇటీవల విడుదలైన బీఈడీ ఎంట్రెన్స్ ఎడ్ సెట్ ఫలితాల్లో 150 మార్కులకు 117.4 మార్కులు సాధించి తెలంగాణలోనే ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం తాండూరులో నిర్వహించిన మహిళ సంక్షేమ సంబరాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా వినీషను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వినీషను శభాష్ అంటూ అభినందించి.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఆర్డీఓ అశోక్ కుమార్, కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, కౌన్సిలర్, ప్రిన్సిపల్ విజయదేవి తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17838 chaithany collage