schedule Tuesday, September 22, 2026

సామాజిక సేవకు మేమూ సైతం..!

calendar_today June 14, 2023
person dharshininews
సామాజిక సేవకు మేమూ సైతం..!
సామాజిక సేవకు మేమూ సైతం..! - ఎస్ఎస్పీ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత - ఎన్‌ఎస్పీ ట్రస్ట్ చైర్మన్ నూలి శ్రీవాణి పటేల్ - తాండూరులో ట్రస్ట్ కార్యాలయం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవకు మేమూ సైతం ముందుంటామని నూలి శుభప్రద్ పటేల్(ఎన్ఎస్పీ) చారిబుల్ ట్రస్ట్ చైర్మన్ మాలి శ్రీవాణి శుభప్రద్ పటేల్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీవాణి తెలంగాణ బీసీ కమీషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ శ్రీవాణి పటేల్ మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ట్రస్ట్ ద్వారా పేదలకు ఎలాంటి సమస్యలు ఉన్న వారికి సాయంతో పాటు న్యాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. విద్య, వైద్యం, మెడికల్ రంగాలలో పేదలకు చేయూతను అందించేలా దృష్టి సారిస్తామన్నారు. విద్యార్థులను, యువతను ప్రోత్సహించేందుకు తమవంతు సహాకారం అందిస్తామన్నారు. తన భర్త శుభప్రద్ పటేల్ స్ఫూర్తితో చారిటబుల్ సేవలను విస్తరిస్తామన్నారు. గ్రామాల్లోని ప్రతి గడపకు ట్రస్ట్ సేవలతో తోడ్పాటు అందిస్తామన్నారు. ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వాలంటీర్లు, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను, హరీష్, లక్ష్మణ్ చారి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17858 chaithany collage