రేపటి నుంచి సదరం క్యాంపులు
June 15, 2023
dharshininews
రేపటి నుంచి సదరం క్యాంపులు
- స్లాట్ బుకింగ్‌కు నేటి నుంచి అవకాశం
- ప్రకటించిన అధికారులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రేపటి నుంచి సదరం క్యాంపులు ప్రారంభమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ నెలకు సంబంధించి ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16 నుంచి ప్రారంభమయ్యే సదరం క్యాంపుల కోసం నేటి నుంచి మీసేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 325 మందికి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. సదరం క్యాంపుల నిర్వహణలో భాగంగా తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో ఈనెల 16న ఎంఆర్, ఎంఐ, 19న ఓహెచ్, 27న ఎంఆర్, ఎంఐ, 28న ఓహెచ్, 30న హెచ్ఐ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వికారాబాద్‌లోని సీహెచ్‌సీలో 20న ఓహెచ్, 22న వీఐ, 26న ఓహెచ్ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/17890