schedule Sunday, September 06, 2026

ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు

calendar_today June 16, 2023
person dharshininews
ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు
ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు - ఫ్రీగా చేసుకునే అవకాశం - ఎలా చేసుకోవాలంటే..? దర్శిని డెస్క్‌: ఆధార్‌ కార్డు ఇంకా అప్‌డేట్ చేసుకోని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు చాలా మంది తమ ఆధార్ కార్డుల్లో వివరాలను అప్‌డేట్ చేసుకోలేదు. దాని వల్ల మోసాలు జరిగే అవకాశం ఉండడంతో కేంద్రం ఆధార్‌ అప్‌డేట్‌ ను ప్రకటిచింది. గత ఫిబ్రవరి 2న ఆధార్ అప్‌డేట్‌పై కేంద్రం ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. గత పది సంవత్సరాలుగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోని వారు ఈ నెల 14వ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే తదుపరి అప్‌డేషన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తాజాగా కేంద్రం ప్రకటించిన గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోలేదు. ఈ క్రమంలో అప్‌డేట్‌పై కొత్త డేట్‌ను ప్రకటించింది. అప్‌డేట్ గడువును మరో మూడు నెలలు పెంచింది. వచ్చే సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం గడువు పెంచారు. తమ ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ https://myaadhaar.uidai.gov.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17890 chaithany collage