schedule Saturday, July 04, 2026

ఒకే డెలివరిలో ముగ్గురు..!

calendar_today June 21, 2023
person dharshininews
ఒకే డెలివరిలో ముగ్గురు..!
ఒకే డెలివరిలో ముగ్గురు..! - అందరు ఆడపిల్లలే - ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఒకే డెలివరీలో ముగ్గురు జన్మించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన కర్నూలు వడ్డె నవీన్‌కు లక్ష్మీతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. గత యేడాది వీరికి ఒక పాప, బాబు పుట్టి చనిపోయారు. తాజాగా గర్భం దాల్చిన లక్ష్మీకి నెలలు నిండడంతో గత బుధవారం తాండూరులోని ఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమెకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు. తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు జన్మించినందుకు కుటుంబ సభ్యులు సంతోష పడ్డారు. కాని గనిలో కూలి పనులు చేసుకుంటూ పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి.... https://dharshininews.com/18021 chaithany collage