schedule Sunday, July 05, 2026

మూడు గేదెల మృత్యువాత

calendar_today June 25, 2023
person dharshininews
మూడు గేదెల మృత్యువాత
మూడు గేదెల మృత్యువాత - విద్యుత్‌ షాక్‌ తగిలి ఘోరం - లక్ష్మీ నారాయణపూర్‌ గ్రామంలో ఘటన యాలాల, దర్శిని ప్రతినిధి: విద్యుత్ షాక్ తగిలి మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్‌లో చోటు చేసుంది. గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్‌ దళిత బంధు పథకం కింద మూడు గేదెలు తెచ్చుకుని పోషిస్తున్నాడు. ఆదివారం శ్రీనివాస్ అన్న ప్రకాష్‌ వాటిని గ్రామ సమీపంలోని పోలానికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో డి రవి అనే వ్యక్తి పొలం వద్ద విద్యుత్‌ స్థంబాల ఫెన్షింగ్ వైరు తగిలి మూడు గేదెలు ఒకేసారి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాయి. వాటి వెనక ఉన్న ప్రకాష్‌ కూడా విద్యుత్‌ షాక్‌కు గురై ఎగిరి పడ్డాడు. ముందు వెళ్లిన మూడు గేదేలు విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే మూడు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18114 chaithany collage