schedule Saturday, July 04, 2026

అందరు రక్తదానం చేయాలి

calendar_today June 27, 2023
person dharshininews
అందరు రక్తదానం చేయాలి
అందరు రక్తదానం చేయాలి - ఆర్టీసీ డిపో మేనేజర్ సమత - తాండూరులో డీపోలో రక్తదాన శిబిరం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ మనిషి ప్రాణాలను కాపాడేందుకు అందరు రక్తదానం చేయాలని తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమత అన్నారు. మంగళవారం తాండూరు ఆర్టీసీ డీపో ఆధ్వర్యంలో హెచ్ డీఎఫ్ సీ తాండూరు శాఖ బ్యాంకు, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం సహాకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఒకరి రక్తదానం - ముగ్గురికి ప్రాణదానం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రజలు, ప్రయాణీకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సమత మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహద పడుతుందన్నారు. యువత, ప్రజలు స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకురావాలన్నారు. ఉదయం నుంచి నిర్వహించిన శిబిరంలో 15 మంది రక్తదానం చేశారు. అనంతరం వారికి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.టీ.వాణి, హెల్త్ వాలంటీర్స్ బీసీ శేఖర్, ఎం.శోభ, శ్యాంసుందర్ రెడ్డి, నందులాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18166 chaithany collage