schedule Saturday, September 05, 2026

వాట్సాప్‌తో గ్యాస్‌ బుకింగ్‌..!

calendar_today June 28, 2023
person dharshininews
వాట్సాప్‌తో గ్యాస్‌ బుకింగ్‌..!
వాట్సాప్‌తో గ్యాస్‌ బుకింగ్‌..! - ఒక్క మెసేజ్‌తో రీఫిల్‌కు అవకాశం - సేవలను ఎలా పొందాలంటే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : సాధారణంగా గ్యాస్‌ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ నంబర్ లేదా ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేయడం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకుంటుంటారు. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను ఇకపై వాట్సప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాట్సప్‌ ద్వారా హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌, ఇండెన్‌.. వంటి పలు కంపెనీల గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. గతంలో గ్యాస్‌ బుకింగ్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ, లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తూ వినియోగదారులు ప్రయాసపడేవారు. దీంతో రీఫిల్‌ బుకింగ్‌ సులభతరం చేసేందుకే వాట్సాప్‌ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు చమురు సంస్థలు పేర్కొంటున్నారు. సేవలను ఎలా పొందాలంటే..? తాజాగా ప్రవేశ పెట్టిన కొత్త విధానం ద్వారా సదరు కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్‌ పెట్టి సిలిండర్‌ సులువుగా బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్‌ కూడా వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. అందుకు వాట్సప్‌లో కొత్త కనెక్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు. మరి వాటిని పొందాలంటే.. మీరు హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులైతే.. హెచ్‌పీ వాట్సాప్‌ నంబరు 92222 01122లో Bi అని టైప్‌చేసి సెండ్‌ చేయాలి. ఆ త్వరాత వచ్చే మెనూలో పలురకాల సేవలు వస్తాయి. వాటిల్లో అవసరమైన ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ‘సువిధ’ ఎంపిక త్వారా కొత్త కనెక్షన్‌, కనెక్షన్‌ తొలగింపు వంటి సేవలు పొందొచ్చు. అలాగే ఇండేన్‌ కంపెనీ వాట్సప్‌ నెంబర్ 75888 88824, భారత్‌ గ్యాస్‌ వాట్సప్‌ నెంబర్‌ 18002 24344, ఇండేన్‌ కంపెనీ సేవలకు 75888 88824లకు మేసేజ్ చేయాలి. అయితే గ్యాస్‌ వినియోగదారుల కోసం వాట్సాప్‌ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే వాట్సప్‌ సేవలు వినియోగించుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18147 chaithany collage