schedule Thursday, September 03, 2026

ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆ పోస్ట‌ర్లు నిషేధం

calendar_today September 16, 2021
person dharshininews
ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆ పోస్ట‌ర్లు నిషేధం
ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆ పోస్ట‌ర్లు నిషేధం - ఉత్త‌ర్వులు జారీ చేసీన ఎండీ స‌జ్జ‌నార్ ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇక‌పై అలాంటి పోస్ట‌ర్లు క‌నిపించ‌వ‌ని ఆ శాఖ నూత‌న ఎండి స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. బ‌స్సుల‌పై ఆశ్లీల చిత్రాల పోస్ట‌ర్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు గురువారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన స‌జ్జనార్ తన‌దైన ముద్ర‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవల అనామకుడిలా సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయంలో భాగంగా ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్టర్లను అంటించకుండా నిషేధం విధించారు. ఓ జ‌ర్నలిస్టు.. ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటించే ఆశ్లీల పోస్టర్ల విష‌యాన్ని స‌జ్జనార్ దృష్టికి తెచ్చారు. దీనిపై సోషల్ మీడియాలోనే నెటిజ‌న్ ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్టర్లను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆర్టీసీలో పాలనపరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.