schedule Wednesday, September 09, 2026

శాకాంబరీ నమోస్తుతే..!

calendar_today July 7, 2023
person dharshininews
శాకాంబరీ నమోస్తుతే..!
శాకాంబరీ నమోస్తుతే..! - రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ - దర్శించుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శాకాంబరీ మహోత్సవాలను నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకానాగ ఎల్లమ్మను శాకాంబరి మాతగా అలంకరించారు. ఆలయంలో చుట్టు కూరగాయలు, ఆకు కూరలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేణుకానాగ ఎల్లమ్మను ఆలయ మహిళ మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని అన్ని రకాల కూరగాలతో పాటు ఐదు రకాల పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఉదయం నుంచి లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలను నిర్వహించారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా భక్తులు కూడ ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.     chaithany collage