schedule Saturday, July 04, 2026

లక్షాధికారులకు శుభవార్త..!

calendar_today July 14, 2023
person dharshininews
లక్షాధికారులకు శుభవార్త..!
లక్షాధికారులకు శుభవార్త..! - రేపటి నుంచే రూ. లక్ష సాయం చెక్కుల పంపిణీ - జిల్లాలో తొలివిడతో 200ల మంది లబ్ది - మిగతా లబ్దిదారులకు ఎలా అమలు చేస్తారంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : బీసీ కుల, చేతి వృత్తి దారులకు ఆర్థిక చేయూతను అందించేందుకు తెలంగాణ సర్కారు అందిస్తున్న రూ. 1లక్ష సాయం లబ్దిదారులకు అధికారులు శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న ఈ పథకం కింద వికారాబాద్‌ జిల్లాలో రేపటి నుంచి ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు పొందారు. జిల్లాలో ఇప్పటికే 13,157 దరఖాస్తులను స్వీకరించారు. కుమ్మరి, అరేకటికే, నేత, రజక, నాయి బ్రాహ్మణ, వడ్రంగి వంతి చేతి వృత్తి దారులతో పాటు బీసీల నుంచి వీటిని స్వీకరించారు. అయితే జిల్లాలో తొలి విడతగా 200 మందికి రూ.1లక్ష సాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాలు, మున్సిపాల్టీలలో ఒక్కో మండలం నుంచి దాదాపు 10 మంది లబ్దిదారులున ఎంపిక చేశారు. రేపు 15వ తేది శనివారం నుంచి ప్రభుత్వ ఆదేశాలకు ఎంపిక చేసిన లబ్దిదారులకు రూ. 1లక్ష ఆర్థిక సాయం చెక్కులను అందజేయబోతున్నారు. మరోవైపు తరువాత నుంచి ప్రతి నెల చెక్కుల పంపిణీ కొనసాగుతుందని, చివరి లబ్దిదారుడి వరకు సాయం అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. దశల వారిగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రభుత్వం అందించనున్న రూ. 1లక్ష సాయం చెక్కుల పంపిణీపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18525 chaithany collage