schedule Saturday, July 04, 2026

ఎద్దులే.. పెద్దలు..!

calendar_today July 25, 2023
person dharshininews
ఎద్దులే.. పెద్దలు..!
ఎద్దులే.. పెద్దలు..! - గౌరవించిన పెండ్లి కొడుకు - అథితులై ఆకర్షించిన ఎద్దులు - వైరల్‌గా మారిన సంఘటన దర్శిని డెస్క్‌: కర్ణాటకలో జరిగిన ఓ వివాహా వేడుకలో ఎద్దులు పెండ్లి పెద్దల అవతారం ఎత్తాయి. పెండ్లికి అవే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయంలో సాయంగా ఉన్న కాడెద్దులపై ఓ యువరైతు చాటుకున్న వినూత్న ప్రేమ చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని నంజన్‌గూడు తాలూకా చిక్కహోమ్మా గ్రామానికి చెందిన మహేష్‌తో సోమవారం అదే రాష్ట్రం చామరాజనగర తాలూకా పణ్యదహుండి గ్రామంలో యోగిత అనే యువతితో వివాహం జరిగింది. వృత్తిరిత్యా రైతు అయిన మహేష్ సాగులో తోడుగా నిలిచే ఎద్దులు అంటే వరుడు ఎంతో ఇష్టం. వాటి సమక్షంలోనే తన వివాహం జరగాలని తల్లిదండ్రులు, అత్తమామలను ఒప్పించారు. మండపం పక్కనే వాటి కోసం వేదిక ఏర్పాటు చేయించారు. పూలతో అలంకరించిన ఎద్దులను వాటిపై ఉంచారు. సెల్ఫీ పాయింట్‌, సెల్ఫీ జోన్‌ అంటూ ఈ మధ్యన వేడుకల వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ప్రయత్నం ఎంతగానో ఆకట్టుకుంది. పెళ్లికి వచ్చిన బంధువులు జోడెడ్లతో ఫొటోలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు రైతులు యువరైతు మహేష్‌ను అభినందిస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18828 chaithany collage