schedule Monday, July 06, 2026

కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు

calendar_today July 25, 2023
person dharshininews
కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు
కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు - తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - రూ. 5లక్షల జరిమాన కూడా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయను రూ. 5 లక్షల జరిమాన కూడా విధించింది. స్పష్టంచేసింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్ ను ప్రకటించాలని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్ రావు పోటీశారు. ఆయనకు ప్రత్యర్థిగా జలగం వెంకట్రావ్‌ పోటీ చేశారు. కాంగ్రెస్ గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వనమా వెంకటేశ్వరరావు తన భార్య పేరు ఉన్న ఆస్తులను ప్రకటించకపోవడంతో జలగం వెంకట్రావు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ తో పాటు సమర్పించాల్సిన ఫామ్ 26 కు సంబందించిన వివరాలను వనమా సమర్పించలేదు. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు అఫిడవిట్లో ఉన్న వనమా మెన్షన్ చెయ్యలేదు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావునె 2018 డిసెంబర్ 12 నుంచి ఆయననే ఎమ్మెల్యే గా గుర్తించాలని తెలంగాణ ధర్మాసనం తీర్పులో వెలువరించింది. దీంతో పాటు వనమా వెంకటేశ్వర రావుకు రూ. 5 లక్షల జరిమాన కూడా విధించింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18843 chaithany collage