schedule Saturday, July 04, 2026

జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

calendar_today July 26, 2023
person dharshininews
జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి
జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి - సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డులు రాసిన జర్నలిస్టులు - తాండూరులో విజయవంతంగా పోస్టు కార్డు ఉద్యమం తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజానికి వారధులుగా నిలిచే జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారిలు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమం తాండూరులో విజయవంతంగా చేపట్టారు. బుధవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణల ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్టాఫీసు వద్ద చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, క్రమశిక్షణ సభ్యులు వెంకటేశం (వాసు)లు అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో నియోజకవర్గ జర్నలిస్టులు సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డులు రాసి డబ్బాలో వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. అలాంటి జర్నలిస్టులు నేడు తెలంగాణలో ఆరోగ్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్నారు. కావున జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినీయర్ జర్నలిస్టులు రాంచందర్, భీంసేన్ రావు, నరేందర్, తాండూరు పట్టణ అధ్యక్షులు నిరంజన్ స్వామి, జర్నలిస్టులు వెంకట్రామ్ రెడ్డి, శాంతు, వెంకటేష్, సంగమేష్, శివకుమార్, రాంరెడ్డి, దీపక్, గోపాల్, శ్రీను, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18866 chaithany collage