schedule Saturday, July 04, 2026

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

calendar_today July 31, 2023
person dharshininews
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి - తాండూరు ఆర్డీఓకు తపస్ సంఘం నేతల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నేతలు డిమాండు చేశారు. ఉపాధ్యాయ ఉద్యమ జాగరణలో భాగంగా సోమవారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు తపస్ రాష్ట్ర కోశాధికారి కె. లక్ష్మీకాంత రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందంలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏండ్లులుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, ఐదేండ్లుగా బదిలీలు కూడా జరగడం లేదన్నారు. రెండో పీఆర్సీ కమిటిని నియామకం చేపట్టాలని, ఉద్యోగుకలు ఐఆర్ ను ప్రకటించాలన్నారు. దీంతో ఉపాధ్యాయులు నిరాశలో ఉన్నారన్నారు. అదేవిధంగా పాఠశాలలకు వాచ్ మెన్ లను నియవి. మంచాలని, స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పెండిగ్ లో ఉన్న పండిత్, పీఈటీ ఆఫ్ గ్రేడేషన్స్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా మీడియా కవ్విసర్ జీ, బస్వరాజ్, తాండూరు నియోజకవర్గ కన్వినర్ శ్రీశైలం, తాండూరు, పెద్దేముల్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్, రాజేష్, యాలాల మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల బాధ్యులు భరత్. డి. శ్రీనివాస్, సిద్రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18900 chaithany collage