రూ. 50ల కోసం హత్య..!
July 31, 2023
dharshininews
రూ. 50ల కోసం హత్య..!
- ఏడాది తరువాత నిందితుడికి జీవిత ఖైదు
- రూ. 1 వెయ్యి జరిమాన విధించిన న్యాయస్థానం
- వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: రూ. 50ల కోసం హత్యకు పాల్పడ్డ నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ.1 వెయ్యి జరిమాన విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన రాథోడ్ విలాస్ (25) గత యేడాది మే 2వ తేదిన రాథోడ్ మంగ్లీ బాయి అనే మహిళ దగ్గర రూ. 50ల కోసం గొడవ పడ్డాడు. దీంతో రాథోడ్ విలాస్ మంగ్లీ బాయిని హత్య చేశాడు. అప్పట్లో పెద్దేముల్ పోలీస్టేషన్ లో ఎస్ఐ ఎండి రవూఫ్ కేసు నమోదు చేశారు. తాండూరు డిఎస్సీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబులు కేసు దర్యాప్తు చేపట్టి కోర్టుకు అందించారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ జిల్లా న్యాయస్థానంలో జరిగిన వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి నిందితుడనికి జీవిత ఖైదుతో పాటు రూ. 1 వెయ్యి జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18931