schedule Saturday, September 05, 2026

బీడీ టేకేదారులకు ఫించన్‌..!

calendar_today August 1, 2023
person dharshininews
బీడీ టేకేదారులకు ఫించన్‌..!
బీడీ టేకేదారులకు ఫించన్‌..! - అంగీకారం తెలిపిన తెలంగాణ సర్కారు - ఎప్పటి నుంచి అందిస్తారంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీడీ టేకేదారులకు ఆసరా ఫించన్‌ అందించాలని నిర్ణయించింది. ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. బీడీ టేకేదార్లకు కూడా రూ. 2016 పెన్షన్ వస్తుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకంలో బీడీ కారులకు ఫించన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. అసలు బీడీ టేకేదారులు ఎవరంటే.. బీడీ కార్మికులు చేసిన బీడీలను లెక్కించి, ప్యాకింగ్ చేసి, కంపెనీలకు అప్పగిస్తారు. వీరినే టేకేదారులు అంటారు. బీడీ కార్మికుల మాదిరిగానే వీరు పని చేస్తున్నందన.. వీరికి పెన్షన్ ఇవ్వడం సరైన నిర్ణయం అని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేయగా.. మంత్రులు అంగీకారం తెలిపారు. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల అనంతరం వీరికి కూడా పెన్షన్ అందనుంది. అయితే, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18936