schedule Tuesday, September 08, 2026

తల్లిపాలే శిశువులకు శ్రేయస్కరం

calendar_today August 5, 2023
person dharshininews
తల్లిపాలే శిశువులకు శ్రేయస్కరం
తల్లిపాలే శిశువులకు శ్రేయస్కరం - పల్లె దవఖాన వైద్యురాలు డా. రాజేశ్వరి తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లిపాలే శిశువులకు ఎంతో శ్రేయస్కరమని తాండూరు పల్లె దవాఖాన వైద్యురాలు డా. రాజేశ్వరి అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శనివారం తాండూరు పట్టణంలోని 33వ వార్డులో ఉన్న అంగన్ వాడి కేంద్రం 1,2లో బాలింత, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డుకు అమృతంతో సమానమన్నారు. తల్లిపాలతోనే ఓడ్డలు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఎదుగుతారని అన్నారు. పుట్టిన శిశువులకు మర్రుపాలు తాగించడం ఎంతో శ్రేయస్కరమన్నారు. దీంతో పాటు బాలింతలు తల్లిపాలు అందించడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలకు దూరంగా ఉంటారని అన్నారు. అనంతరం గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ రాజేశ్వరి, ఆశ వర్కర్ సుజాత, ఆయా లక్ష్మి, గర్భిణీ, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19074