గ్రంథాలయాల అభివృద్ధికి చొరవ చూపాలి
August 5, 2023
dharshininews
గ్రంథాలయాల అభివృద్ధికి చొరవ చూపాలి
- వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
- ఢిల్లీ లైబ్రరీ ఫెస్టివల్లో పాల్గొన్న రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విజ్ఞాన భాండాగారాలు అయిన గ్రంథాలయాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చూపాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లైబ్రరీ ఫెస్టివల్ లో ఉత్సహాంగా జరిగాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో అజాదీగా అమృతోత్సవంలో భాగంగా ఉత్సవాలను నిర్వహించారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ముఖ్యఅతిథిగా జరిగిన ఫెస్టివల్ లో వికారాబాద్ జిల్లా నుంచి చైర్మన్ రాజుగౌడ్, కార్యదర్శి పేరం సురేష్ బాబులు హాజరయ్యారు. శని, ఆదివారాలు రెండు రోజులు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఫెస్టివల్ లో పాల్గొన్న చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చేందుకు కృషి చేస్తుందన్నారు. అదే తరహాలో కేంద్రం తెలంగాణలోని గ్రంథాలయాలను కూడా డిజిటల్ లైబ్రరీగా మార్చడంతో పాటు ఆధునీకరణించేలా చొరవ చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఉప సంచాలకులు శ్రీహరి, శంకర్ లతో పాటు 15 జిల్లాల చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/19079