schedule Wednesday, September 09, 2026

ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

calendar_today August 14, 2023
person dharshininews
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు - పాలు లేక తల్లి ఆవు సతమతం - తాండూరు గోశాల నుంచి గోవు దానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల పరిధిలోని కోట్ బాస్ పల్లి గ్రామానికి చెందిన వడ్డే నవీన్..లక్ష్మీ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు జన్మనివ్వడంతో తల్లిపాల ఇబ్బందిని ఎదుర్కొన్నారు. మొదటి సారి కూడా లక్ష్మీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అయితే ఈ ఇద్దరు కవల పిల్లలు పుట్టిన వెంటనే చనిపోయారు. తాజాగా మరోసారి లక్ష్మీ గర్భం దాల్చింది. ఒకే గాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ముగ్గురు కూడా ఆడపిల్లలు పుట్టారు. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. ముగ్గురు చిన్నారులకు తల్లి పాలు సరిపోవడం లేదు. విషయాన్ని కోట్ బాస్ పల్లి గ్రామ సర్పంచ్ నాగార్జున ద్వారా ఇటీవల మల్కాపూర్ గ్రామ పర్యటనకు వెళ్లిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి లక్ష్మీ దంపతులు వివరించారు. తల్లిపాలు లేక అల్లాడుతున్న లక్ష్మీ సంతానంను ఆదుకోవాలని తాండూరు గోశాల నిర్వాహకులను ఎమ్మెల్యే కోరారు. దీంతో ఆదివారం తాండూరు గోశాలలో బాధిత కుటుంబానికి గోశాల నిర్వాహకులు గోదానం చేశారు. గోశాల నుంచి పాలు ఇచ్చే అవును ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19295