schedule Saturday, July 04, 2026

అమ్మాయి చదువుకు ఆరేళ్లుగా ఆర్థిక సాయం

calendar_today August 18, 2023
person dharshininews
అమ్మాయి చదువుకు ఆరేళ్లుగా ఆర్థిక సాయం
అమ్మాయి చదువుకు ఆరేళ్లుగా ఆర్థిక సాయం - రూ. 12వేల చొప్పున సాయం అందిస్తున్న కిసాన్ బందు - కృతజ్ఞతలు తెలిపిన తల్లి వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి చదువుకు కిసాన్‌ బందు ద్వారా చేయూతనందిస్తోంది. గత ఆరేళ్లుగా రూ. 12 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. కిసాన్ బందు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.రవీందర్ గౌడ్ ఈ సాయం అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన జిల్లాలోని లగచర్ల గ్రామానికి చెందిన అనసూయ భర్త కొన్నికారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి వారి కూతురు మీనాక్షి చదువుకు కిసాన్‌ బందు, టీవీవీ ద్వారా రవీందర్ గౌడ్ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆరేళ్ల నుంచి రూ. 12 వేల చొప్పున ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి 7వ తరగతి చదువుతోంది. తాజాగా శుక్రవారం కూడా కిసాన్ బందు, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అమ్మాయి తల్లి అనసూయకు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు పుస్తకాలను అందజేశారు. 6రేళ్లుగా అమ్మాయి చదువుకు అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల తల్లి కిసాన్‌ బందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కిసాన్ బందు వ్యవస్థాపకులు సతీష్ రంగంపేట, కుంచెం స్నేహ, పీఆర్టీయూ బొంరాస్ పేట్ మండల అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19413