schedule Saturday, July 04, 2026

ధార్మిక విద్యపై అవగాహన కలిగి ఉండాలి

calendar_today August 20, 2023
person dharshininews
ధార్మిక విద్యపై అవగాహన కలిగి ఉండాలి
ధార్మిక విద్యపై అవగాహన కలిగి ఉండాలి - జమియతే ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు - జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పాల్గొన్న విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ధార్మిక విద్యపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాని జమియతే ఉలేమా ఏ హింద్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ అతహర్ ఖాస్మీ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జమియతే ఉలేమా ఏ హింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటి అదేశాలతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ముస్తీ మహమ్మద్ జైనుద్దీన్ ఖాస్మీ, మౌలానా అబ్రార్ ఆధ్వర్యంలో 200ల మంది విద్యార్థులకు, తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అజర్ ఖాస్మీ(అధ్యక్షులు) ఆధ్వర్యంలో 1700ల మంది విద్యార్థులకు, కోడంగల్లోని జూనియర్ కళాశాలలో మౌలానా మహమ్మద్ అబ్దుల్ బాసిత్ (అధ్యక్షులు) అధ్వర్యంలో 400ల మంది విద్యార్థులు మొత్తం 2300ల మంది విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తాలీం ఏ ఇస్లాం అనే నినాదంతో ధార్మిక విద్యపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ అతహర్ ఖాస్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులోని ప్రతిభవంతులకు త్వరలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19463