schedule Saturday, July 04, 2026

సాహో చంద్రయాన్‌-3..!

calendar_today August 23, 2023
person dharshininews
సాహో చంద్రయాన్‌-3..!
సాహో చంద్రయాన్‌-3..! - జాబిలి ఉపరితలంపై సాప్ట్ లాండ్ - కాలుమోపిన తొలిదేశంగా భారత్‌కు ఘనత - జయహో అంటూ కీర్తించిన యావత్ భారతావని దర్శిని డెస్క్: యావత్‌ భారత్ మొత్తం జయహో అంటూ కీర్తించిన క్షణం ఇంది. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన చంద్రయాన్-3 ‘చంద్రయాన్-3’ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ‘సాఫ్ట్ ల్యాండ్’ అయింది. ఈ అపురూప క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా తన జయహో అంటూ సంబరాలు చేసుకున్నారు. భూమి సహజ ఉపగ్రహం (చంద్రుడు) ఈ భాగంలో దిగిన ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా అవతరించింది. భారత దేశ పతాకాన్ని ఎగురవేయడం వల్ల శాస్త్రవేత్తలలోనే కాదు, దేశంలోని సాధారణ ప్రజలలో కూడా అపారమైన ఉత్సాహం కనిపిస్తోంది. ‘సాఫ్ట్ ల్యాండింగ్’ గురించి తెలిసిన ప్రతి భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం సాధ్యం కాని ఘనతను చంద్రయాన్‌-3తో భారత్‌ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌తో, భారతదేశం అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించినప్పుడు, ఇస్రో స్థాయి ప్రపంచంలోని ఇతర అంతరిక్ష సంస్థల కంటే ఎక్కువగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలను దేశప్రజలు అభినందిస్తూ వారి కృషిని అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19589